NTV Telugu Site icon

Anchor Shyamala: SEIZE THE ROAD… అనాలి క‌దా?.. పవన్ కు యాంకర్ శ్యామల చురకలు

Shyamala Pawan Kalyan

Shyamala Pawan Kalyan

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. ఈ అంశం మీద ఇప్పటికే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, దిల్ రాజు సంతాపం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వీరి మరణానికి వైసీపీ హయాంలో నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్లే అని విమర్శించారు. దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు.

Mahesh Babu : సోనూసూద్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్

తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్ప‌డం వ‌ర‌కే.. ఆచ‌ర‌ణ‌లో ఉండ‌వు. గేమ్ ఛేంజ‌ర్ మెగా ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతే ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేస్తూ నెపాన్ని గ‌త ప్ర‌భుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు . కాకినాడ‌-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌ధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్ర‌మైంద‌ని మీకు ముందుగానే తెలిసిన‌ప్పుడు ఈవెంట్‌కి మీరు ప‌ర్మిష‌న్ ఎందుకు ఇచ్చారు స‌ర్ SEIZE THE ROAD… అనాలి క‌దా? సినిమాల‌కు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈల‌లు వేసి గోల చెయ్యండి అంటూ యువ‌త‌ను రెచ్చ‌గొడుతూ మీరు మాట్లాడిన మాట‌లు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాట‌లేనా మీ కార‌ణంగా ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోతో క‌నీసం వెళ్లి ప‌రామ‌ర్శించారా అంటే మీ స్వార్థానికి అమాయ‌కుల ప్రాణాలు బ‌లి చేస్తున్నారా ఆ అంటూ ఆమె ప్రశ్నించారు.

Show comments