Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర రాజన్
ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే.. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ.. ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది.
Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్ ఫోనే కానీ 10 లక్షలు!
ఈ ఏడాది రేఖా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనశ్వర.. ఈ ఆరు నెలల కాలంలో ఐదు సినిమాలు దించేసి మాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరం హీరోయిన్లలో ఈమెలా సూపర్ ఫాస్ట్‌గా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ మరొకరు లేరనే చెప్పాలి. హిట్స్, ప్లాప్స్తో సంబంధం లేకుండా దూసుకెళుతోంది. రేఖా చిత్రం తర్వాత వచ్చిన ఎన్ స్వాంతమ్ పుణ్యాలం, పైంకిలీ పెద్దగా సందడి చేయలేకపోయాయి. మిస్ అండ్ మిస్టర్ బ్యాచ్‌లర్ సోసో అనిపించుకుంది.
Also Read:Tollywood: పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. అంతా గజిబిజి గందరగోళం
రీసెంట్లీ రిలీజైన వ్యాసన సమేతమ్ బంధుమిత్రాదికల్తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనశ్వర. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ నిర్మించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ అధినేత, టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గార్లపాటి సహా నిర్మాతగా వ్యవహరించాడు. ప్రజెంట్ ఆయన చిరంజీవి-అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు. ఇక అనశ్వర రాజన్ జోరు చూస్తుంటే.. ఈ ఏడాది ఆమెను నుండి మరిన్ని మూవీస్ ఎక్స్ పెక్ట్ చేయోచ్చు. మేడమ్ చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ఒకటి సెవెన్ బై జీ బృందావన్ కాలనీ సీక్వెల్. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏడాదికి మినిమం మూడు నాలుగు సినిమాలను దించేసే ఈ బ్యూటీ భవిష్యత్తులో కూడా ఈ జోరు కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్‌కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!