Site icon NTV Telugu

Anasuya : తన సినీ ఎంట్రీ మిస్టరీ రివిల్ చేసిన అనసూయ..

Anasuya

Anasuya

టీవీ స్క్రీన్‌పై అటు గ్లామర్‌తోనూ, ఇటు డాషింగ్ యాంకరింగ్‌తోనూ ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ భరద్వాజ్. ప్రజంట్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో.. మంచి పాత్రలు ఎంచుకుంటూ తన కంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంటోంది. కానీ ఈ స్థాయికి చేరే ముందు ఆమె ప్రయాణం ఎలా ఉండేదో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.  తన కెరీర్ ప్రారంభ దశ గురించి మాట్లాడిన అనసూయ, చాలామందిని ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడించారు.

Also Read : Bhadrakali : లైవ్‌లో గన్ షూటింగ్ చేసిన సురేష్ బాబు, విజయ్ ఆంటోనీ..

అనసూయ మాట్లాడుతూ.. ‘ నేను మొదట VFX కంపెనీలో HR‌గా పని చేశాను. అదే సమయంలో 2008లో విడుదలైన ఎన్టీఆర్ నటించిన, ‘కంత్రి’ సినిమాలో , చిన్న యానిమేటెడ్ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ (కార్టూన్ స్టైల్‌లో) గుర్తుందా? ఆ ప్రాజెక్టు జరుగుతున్న సమయంలో ఆ కంపెనీలో HR గా పనిచేస్తున్న. అప్పుడే దర్శకులు సుకుమార్, మెహర్ రమేష్ తదితరులు నన్ను గమనించారు” అంటూ అనసూయ ఆనాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఈ ఒక్క కామెంట్ ఆమె సినీ రంగంలోకి ఎలా అడుగుపెట్టిందనే ప్రయాణాని స్పష్టంగా తెలిపింది. అప్పటి పరిచయాలు, పరిశ్రమతో ఏర్పడిన సంబంధాలు , ఆమె కెరీర్‌కు మలుపు తిప్పినట్లు తెలుస్తోంది. VFX ప్రపంచం నుంచి స్టార్ యాంకర్‌, విలక్షణ నటి వరకు వచ్చిన ఆమె జర్నీ అనేక మందికి ప్రేరణ గా నిలుస్తోంది.

Exit mobile version