Site icon NTV Telugu

‘పుష్ప’ ఫోటోలు లీక్‌.. ఆసక్తికరంగా అనసూయ గెటప్

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా వున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇక బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పుష్ప సెట్ లోని ఆమె ఫోటోలు లీక్ అయ్యాయి. ఇదివరకు సుకుమార్ ‘రంగస్థలం’లో అనసూయ గెటప్ ఆకట్టుకోగా.. ఈ సినిమాలోను భిన్నమైన గెటప్ లో అనసూయ సెట్స్ మీద కనిపించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఇందులో సునీల్ భార్యగా అనసూయ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవలె ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version