కెరీర్ బిగిన్నింగ్‌లో ప్రతి ఒక్కరు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్ని ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన కూడా ఏదో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హాట్ బ్యూటీ అనన్య పాండే కూడా ఇలాంటి అవమానాలు చాలా ఎదురు కున్నట్లుగా తెలిపింది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అనన్య. 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో అలరించింది.
ఆ తర్వాత వరుస హిట్ కొట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవలే అక్షయ్ కుమార్ సరసన ‘కేసరి – చాప్టర్ 2’లో కనిపించింది. ప్రస్తుతం లక్ష్య్ సరసన ‘చాంద్ మేరా దిల్’ కోసం సిద్ధమవుతున్నది అనన్య. ఇలా వరుస సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగా అందరూ హీరోయిన్లలానే తానుకూడా బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నాననీ చెప్పుకొచ్చింది. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘నేను చాలా చిన్న ఏజ్ 18 – 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. అప్పడు చాలా సన్నగా ఉండేదాన్ని. దాంతో ఇండస్ట్రీలో నా పర్సనాలీటి పై చాలా కామెంట్స్ చేశారు. అగ్గిపుల్ల లా ఉన్నావు, నీ కాళ్ళు కోడి కాళ్ళలా ఉన్నాయి.. నీ శరీరం సరైన ఆకారంలో లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఏజ్ కి తగ్గట్లుగా శరీరంలో మార్పులు జరుగుతాయి. ఇప్పుడిప్పుడే నా శరీరం సహజంగానే మారుతుంటే.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటున్నారు. ఆడవాళ్లు ఎలా ఉన్నా.. ఇలాంటి విమర్శలు తప్పవు. కాబట్టి, పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది అనన్య.
