అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని ఎవరైన కమిట్‌మెంట్ అడిగారా అని ఓ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే జర్నలిస్ట్ వ్యాఖ్యలకు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్రశ్నలు అడిగే ముందు ‘సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు’ ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్ అయినా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టి సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. ఆ జర్నలిస్ట్ ప్రశ్న వేసినప్పుడు నాకు ఇన్ని ఆలోచనలు రాలేదు. ఇంటికి వెళ్లాక దీని గురించి ఎంతో ఆలోచించా’’ అని చెప్పారు.
Also Read : My3 Arts : లండన్‌లో అనుఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి చెట్టాపట్టాల్
అలాగే మరొక ఇంటర్వ్యూ లో ఈ విషయమై మాట్లాడుతూ ‘ కొన్ని ప్రశ్నలకు మనం సంస్కారంతో ఆన్సర్ చేయాలి. ఎదుటివారికు అది ఉన్న లేకున్నా మన లిమిట్స్ లో మనం ఉండి చేయాలి నేను అదే చేశాను. ఇక ఈ విషయంలోనాకు మీడియా మంచి సపోర్ట్ ఇవ్వడం ఆనందంగా ఉంది. చాలా మంది మీడియా మిత్రులు పర్సనల్ గా కాల్ చేసి ఆమె ఆలా ఆగినందుకు మేము క్షమాపణలు చెప్తున్నాం. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు, సినిమాలల్లో మంచి పాత్రలు చేసారు. అయినా ఒక తెలుగు అమ్మాయిని అలా అడగడంభావ్యం కాదని మీడియా వాళ్ళు చెప్తుంటే నన్ను సినిమా వాళ్ళు ఇంతగా అభిమానిస్తారా, ఒక తెలుగు అమ్మాయిగా ఇంత వాల్యూ ఇస్తారా అని చాలా సంతోషం అనిపించింది” అని అన్నారు.