Site icon NTV Telugu

Ananthika : ఇది నా జీవితానికి దగ్గరైన పాత్ర.. ‘8 వసంతాలు’ సక్సెస్ పై అనంతిక స్పందన

Anathika 8 Vasanthalu

Anathika 8 Vasanthalu

సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథాంశాలతో ప్రేక్షకుల మనసును తాకే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకతను సంపాదిస్తాయి. అటువంటి చిత్రాలలో తాజాగా విడుదలైన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో, నవీన్ యెర్నేని వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించగా.. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ ‘8 వసంతాలు’ అందరినీ ఆకట్టుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రేక్షకుల ఆదరణతో జోరు మీదున్న ఈ చిత్రం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమాల జాబితాలోకి చేరిపోయింది అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ ప్రమోషన్‌కు రెబల్ స్టార్ సపోర్ట్..

ఇందులో భాగంగా అనంతిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘నా పాత్రకు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. థియేటర్‌లో సినిమా చూసినప్పుడు నిజంగా గ్రేట్‌గా అనిపించింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి ప్రేక్షకుల స్పందన ఆశ్చర్యపరిచింది. ఇది నా వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా అనిపించిన పాత్ర. ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి గారికి, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగంగా తెలిపారు. ఈ సక్సెస్‌మీట్‌లో డీఓపీ విశ్వనాథరెడ్డి, నటీనటులు కన్నా, సంజన, కిరణ్ తదితరులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

Exit mobile version