Site icon NTV Telugu

Vash Level 2 : ఏ గుజరాతీ ఫిల్మ్‌కు దక్కని ఆఫర్.. రికార్డ్ క్రియేట్ చేసిన వశ్ లెవల్2..

Vash Leval Ott

Vash Leval Ott

కొన్ని సినిమాలు అంతే సెలెంటుగా వచ్చి డిస్కర్షన్‌కు కారణమౌతుంటాయి. ఇప్పుడు అలాంటి సెన్సేషనే క్రియేట్ చేస్తుంది గుజరాతీ ఫిల్మ్ వశ్ లెవల్2. ఆగస్టులో థియేటర్లలో రిలీజై ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వశ్2 ఓటిటి రైట్స్ రూ. 3.5 కోట్ల వెచ్చించి మరీ దక్కించుకుందట నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ సినిమాకు జరగకపోవడమే ఈ సెన్సేషన్‌కు కారణం.

Also Read : Tollywood : భీమ్స్ సిసోరిలియోకు సూర్య ఛాన్స్?

ఆగస్టు 27న వశ్ లెవల్ 2ని గుజరాతీతో పాటు హిందీలో డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేశారు. సుమారు రూ. 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.16 నుండి రూ. 18 కోట్ల వరకు రాబట్టుకుంది. అక్టోబర్ 22 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ కావడానికి రీజన్, ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీ కావడంతో పాటు ఎంగేజింగ్‌ కాన్సెప్ట్ కావడమే. 2023లో వచ్చిన వశ్‌కు ఇది సీక్వెల్. వశ్ సినిమాను హిందీలో సైతాన్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు అజయ్ దేవగన్. వశ్‌కు కొనసాగింపుగా వశ్ లెవల్ 2ని తీసుకు వచ్చాడు దర్శకుడు కృష్ణ దేవ్ యాజ్ఞిక్. ఇందులో తెలుగులో నటించిన హీరోయిన్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ కీ రోల్ ప్లే చేసింది. సినిమా విషయానికి వస్తే ఓ గర్ల్స్ హై స్కూల్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. కొంత మంది అమ్మాయిలు స్కూల్ భవనం నుండి దూకి సూసైడ్ చేసుకుంటారు. అసలు వాళ్లెందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? వాళ్లకు ఏమైంది అనే సస్పెన్స్ తో రూపొందింది ఈ సూపర్ న్యాచురల్, సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్.

Exit mobile version