Amrutha Chowdary : టాలీవుడ్లోకి మరో టాలెంటెడ్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హీరోయిన్గా రాణించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ, ఆ కలనే నిజం చేసుకునేందుకు ఉక్కు సంకల్పంతో అడుగులు వేస్తోంది అమృత చౌదరి. ఏమాత్రం సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం నటనపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ తెలుగు అమ్మాయి.. ఇప్పుడు రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అమృతకి చిన్న వయసు నుంచే నటనపై విపరీతమైన ఆసక్తి ఉండేది. సరిగ్గా 16 ఏళ్ల వయసులోనే టిక్‌టాక్ వీడియోల ద్వారా తన క్రియేటివ్ జర్నీని ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా తనలోని అభినయాన్ని ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆకట్టుకున్న ఆమె, అదే పట్టుదలతో నేడు సిల్వర్ స్క్రీన్‌పై అవకాశాలను దక్కించుకుంటోంది. చిన్నచిన్న సపోర్టింగ్ పాత్రలతో సరిపెట్టుకోకుండా, నేరుగా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యం అని చెబుతోంది.
ఒకవైపు మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతూనే, మరోవైపు సినిమాలపై తన ప్యాషన్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ‘టార్టాయిస్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోన్న అమృత.. ఓ తమిళ చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల జరిగిన ‘టార్టాయిస్’ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో ఆమె నటనకు ఊహించని ప్రశంసలు దక్కాయి. సీనియర్ నటుడు అవసరాల శ్రీనివాస్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సైతం ఈ సినిమాలో అమృత పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
Also Read
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ చేతికి రాడ్స్ తొలగింపు.. సెట్స్‌పైకి రీఎంట్రీ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
-
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
-
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!