Site icon NTV Telugu

Amritha Aiyer : స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చిన హనుమాన్ బ్యూటీ..

Amrutha Ayyar

Amrutha Ayyar

అమృత అయ్యర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో రామ్ తో ‘రెడ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. ఉన్నంతలో బాగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా కూడా బాగానే ఆడింది. తర్వాత ‘అర్జున ఫల్గుణ’ అనే సినిమా చేసింది అది కూడా అంతంత మాత్రమే ఆడింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయిన ‘హనుమాన్’ సినిమాలో అమృత అయ్యర్ కి మంచి పాత్రే దొరికింది.. కానీ అంత పెద్ద మూవీలో హీరోయిన్‌గా నటించిన కూడా ఎందుకో ఈమెకు దక్కాల్సిన అప్రిసియేషన్ దక్కలేదు.

Also Read : Narne Nithin : నార్నే నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’ ట్రైల‌ర్ రిలీజ్..

దీం తర్వాత అల్లరి నరేష్ తో ‘బచ్చల మల్లి’ సినిమా చేసింది. కానీ ఈ మూవీ స్టోరీ పరంగా ఆకట్టుకున్నప్పటకి అంతగా ఆడలేదు. అయితే సాధారణంగా అవకాశాలు తగ్గినప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ చేసేది సోషల్ మీడియాలో స్కిన్ షో.. ప్రజెంట్ ఇప్పుడు అమృత కూడా అదే బాటలో నడుస్తుంది. మొన్నటి వరకు చీర లంగా వోని పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు. ఇప్పుడు యద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version