NTV Telugu Site icon

Amir Khan : గజనీ సీక్వెల్ లో అమీర్ ఖాన్.. దర్శకుడు ఎవరంటే..?

Amir

Amir

తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’. తెలుగులోను డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

Also Read : The Deal : హీరో కమ్ దర్శకుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్రెండ్

కాగా ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు అమీర్ ఖాన్ .  ఈ బాలీవుడ్ హీరో చాలా సంవత్సరాల తర్వాత తమిళ సినిమాలో నటిస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో అమీర్ ఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, టాలీవుడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. తాజాగా అమీర్ ఖాన్  వచ్చి చేరడంతో కూలి పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ షూట్ లో భాగంగానే అమీర్ ఖాన్  తర్వాతి సినిమా ఏమిటనేది చర్చకు రాగ గజనీ 2 కు సంబంధించి ఇటీవల కథ చర్చలు మొదలైనట్టు తమిళ సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. అదే గనక జరిగితే అమీర్ ఖాన్ కెరీర్ లో మరొక సెన్సషనల్ హిట్ నమోదవడం గ్యారెంటీ.