హరిహర వీరమల్లు థియేటర్ రైట్స్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి నైజాంలో ముందు దిల్ రాజు, మైత్రి సంస్థలు రిలీజ్ చేసేందుకు పోటీ పడగా, చివరికి స్వయంగా ఏఎం రత్నం సినిమాని రిలీజ్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
Also Read: Mega 157: సాంగేసుకుంటున్న చిరు, నయనతార
నిజానికి సినిమా మీద ఉన్న నమ్మకంతోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కీలక ఏరియాలో అమ్మకుండా అడ్వాన్స్‌ల మీద పంపిణీ చేయిస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు నైజాంలో అమెరికా సుబ్బారావు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి క్రౌన్ మూవీస్ బ్యానర్ మీద సుబ్బారావు నీలి శెట్టి అమెరికాలో సుపరిచితుడు.
Also Read: NTV Exclusive: మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్న టాలీవుడ్ కమెడియన్?
ఆయన ఎన్నో సినిమాలు అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేశారు. దాదాపుగా 400 సినిమాలను డివిడి, విసిడి రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయగా, 35 ఎంఎం ఫార్మాట్‌లో రెండు వందలకు పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే నైజాంలో ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. అయితే ఆయన చేతికి హరిహర వీరమల్లు నైజాం హక్కులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
