Site icon NTV Telugu

Ameesha Patel : పెళ్లి కాకుండానే అమీషా తల్లి కాబోతుందా..?

Maisha Patel

Maisha Patel

సాధారణంగా సెలబ్రిటీల గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతునే ఉంటాయి. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్‌లో విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ విషయంలో షాకింగ్ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తల్లి కాబోతుందట ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read: Khushbu : ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

ఇటీవల హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతంలో ఆఫర్‌లు రావడం అయిపోయే సమయంలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలయ్యే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముందు ఫ్యామిలీ తర్వాత కెరీర్ అనుకుంటున్నారు. అలాగే దర్శక నిర్మాతల మైండ్‌సెట్ కూడా మారింది.. పెళ్లై, పిల్లలు ఉన్న హీరోయిన్లకు కూడా ఆఫర్లు ఇస్తున్నారు. అయితే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో టాలీవుడ్, బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు.

ఇక పోతే అమీషా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్‌ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో చిలుకపచ్చ కలర్ బికినీ ధరించి, మ్యాంగో ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఫోటోస్‌లో అమీషాకు బేబీబంప్ ఉన్నట్లుగా పొట్ట భాగం లావుగా కనిపించడంతో నెట్టింట రచ్చ మొదలైంది. 49 ఏళ్ల వయసులో పెళ్లి కాకుండా తల్లి ఎలా అయ్యారు? దీనికి కారణం ఎవరు? అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. వీటిపై అమీషా పటేల్ ఇంకా స్పందించలేదు.. ఆమె నోరు విప్పితే తప్పించి నిజనిజాలు బయట పడవు.

 

Exit mobile version