బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ఆయన చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా అమిర్ ప్రెస్ మీట్‌ల్లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తదుపరి చిత్రాల గురించి కూడా మాట్లాడారు.. ఓ విలేకరి ‘పీకే 2’ గురించి ప్రశ్నించగా.. ‘అది కేవలం ప్రచారం మాత్రమే. ఆ ప్రాజెక్టు గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పై సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నాం. తప్పకుండా సినిమా చేస్తాం. రాజ్ కుమార్ హిరాణీ, నేను ఆ పనిలోనే ఉన్నాం. ‘మహాభారతం’ పై సినిమా చేయాలని నా 25 ఏళ్ళ కళ. అది కేవలం సినిమా మాత్రమే కాదు. దానిని ఒక యజ్ఞంలా ఎంతో క్రమశిక్షణతో చేయాలి. అందుకు అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయి. నా కల నెరవేరుతుందో, లేదో తెలియదు. చూడాలి’ అని తెలిపారు. ఇంతలోనే మరో విలేకరి లోకేష్ కనగరాజ్ తో మూవీ గురించి అడగగా..
Also Read : Toxins : బాడీలోని టాక్సిన్స్‌ని బయటకుపంపే 7 అద్భుతమైన కషాయాలు..
‘అవును నిజమే.. మేమిద్దరం ఓ సినిమా చేస్తున్నాం. ప్రస్తుతం దాని పనుల్లోనే బిజీగా ఉన్నాం. సూపర్ హీరో జానర్లో ఈ కథ ఉంటుంది. భారీ స్థాయిలో యాక్షన్ మూవీగా రాబోతుంది. వచ్చే ఏడాది జూన్ తర్వాత దీనిని పట్టాలెక్కించాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంతకు మించి ఏమీ చెప్పలేను. రెండేళ్ల తర్వాత దీని గురించి చర్చించుకుందాం’ అని అమీర్ కుండబద్దలు కొట్టాడు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
