Ameer Log : హైదరాబాద్ బిర్యానీ బ్యాక్‌డ్రాప్‌తో ‘అమీర్ లోగ్’ సినిమా!

Ameer Logg

Ameer Logg

ఒక సరికొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అమీర్ లోగ్’ మూవీ. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, ప్రముఖ బిల్డర్ రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ చిత్ర యూనిట్ సమక్షంలో ఎంతో జోష్‌గా సాగింది.

దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ.. తన కథను నమ్మి, నటనతో నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఆర్టిస్టులకు, టీజర్ లాంచ్‌కి వచ్చిన వంశీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా అందరినీ అలరిస్తుందనే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నటీనటులు మనోజ్, వేద జలంధర్, మనోహర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్, కామ్రేడ్ కళ్యాణ్ నిర్మాత వెంకట కృష్ణ తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొని, సరికొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ పక్కా లోకల్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

ప్రాపర్ హైదరాబాద్ నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు స్మరణ్ సాయి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఈ సినిమా షూటింగ్ అంతా లంగర్ హౌజ్ పరిసరాల్లో జరిగితే, మ్యూజిక్ వర్క్ అంతా కాచిగూడలో జరిగింది. ఇది పక్కా హైదరాబాదీ సినిమా. ముఖ్యంగా ఈ మూవీలో కథ, కథనం అంతా బిర్యానీ చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది” అంటూ సినిమాలో ఉండే లోకల్ ఫ్లేవర్‌ను రివీల్ చేశారు. నటుడు విశ్వేందర్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. ఇందులోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుందని, ఎవరూ నటించినట్టు కాకుండా జీవించినట్టు ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.