NTV Telugu Site icon

Matka : డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్

Matka

Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ రిలీజ్ సినిమా ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం  వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, బాలీవుడ్ భామా నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఎన్నో అంచనాలతో నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

Also Read : Pushpa2TheRule : పుష్ప -2 బుకింగ్స్ కోసం స్పెషల్ యాప్.. కాసేపట్లో బుకింగ్స్ ఓపెన్.!

కానీ మొదటి ఆట నుండి మట్కా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం బాగున్నప్పటికి తెరపై మలచడంలో దర్శకుడు కరుణ కుమార్ తడబడ్డాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కు ఈ  సినిమా మరొక ప్లాప్ గా మిగిలింది. కాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను విడుదలకు ముందే ప్రముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ప్లాప్ కావడంతో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే  ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది అమెజాన్. ఓటీటీ లో ఈ డిసెంబరు 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ అధికారకంగా ప్రకటించారు. మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన మట్కా ఓటీటీ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Show comments