Site icon NTV Telugu

Amardeep : బిగ్ బాస్ అమర్‌దీప్ హీరోగా కొత్త సినిమా

Amardeep

Amardeep

సన్నీ లియోన్ నటించిన ‘మందిర’ తో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ‘సుమతీ శతకం’ అంటూ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. బండారు నాయుడు ఈ కథను అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట పని చేస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read : Rambha : వారి కోసమే ఇండస్ట్రీకి దూరం అయ్యా..

ఇక ఈ యూత్‌ఫుల్, ఎంగేజింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రత్యేక అతిథులతో పాటు చిత్ర తారాగణం, సిబ్బంది పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అమర్ యాక్టింగ్ మనం బుల్లితెరపై చూసాం ఈ సారి వెండితెరపై హీరోగా రాబోతున్నాడు. మరి ఈ మూవీ తన కెరీర్‌ను ఏమాత్రం మలుపు తిప్పుతుందో చూడాలి.

Exit mobile version