Site icon NTV Telugu

Amaran : రజనీకాంత్, విజయ్ ను వెనక్కినెట్టిన ‘శివకార్తికేయన్’

Amaran

Amaran

శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్ రెకార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ్ చిత్రాలలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలలో అమరన్ ఒకటిగా నిలిచింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఈ సినిమా శివకార్తీకేయన్ కెరీర్ లోనే  బెస్ట్ సినిమాగా నిలిచింది.

Also Read : Allu Arjun : ‘చిక్కు బాబాయ్‌’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్

గత నెల దీపావళి కనుకగా రిలీజ్ అయిన అమరన్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. కాగా ఈ సినిమా  తమిళ సూపర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ రిలీజ్ వేట్టయాన్ సినిమాను వెనకు నెట్టింది. రజనీ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 180 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా అమరన్ ఆ కలెక్షన్స్ ను కేవలం పదిహేను రోజుల్లో  క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరొక తమిళ హీరో విజయ్ సినిమాను సైతం అమరన్ అధిగమించింది. ఈ సారి బుకింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. విజయ్ నటించిన తాజా చిత్రం G.O.A.T బుక్ మై షో లో బుకింగ్స్ పరంగా 4.5 మిలియన్ టికెట్స్ సేల్స్ తో టాప్ 1 నిలవగా, అమరన్ ఇప్పటి వరకు 4.52 మిలియన్ టికెట్స్ బుకింగ్స్ తో గోట్ రికార్డును బద్దలు కొట్టి తమిళనాడు 2024 హయ్యెస్ట్ బుకింగ్స్ సాధించిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది అమరన్.

 

Exit mobile version