NTV Telugu Site icon

Amaran : తన రికార్డును తానే బద్దలు కొట్టిన శివకార్తికేయన్

Sk

Sk

ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటించింది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా దీపావళికి అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల చేసారు. మినిమం బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Kiran : పెళ్లి అయితే .. సక్సెస్ వస్తుంది.. అందుకే పెళ్లి చేసుకోండి..

అమరన్ సక్సెస్ తో శివకార్తికేయన్ మరో మైలురాయి దాటాడు. దాంతో పాటు తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ సినిమాతో ఫస్ట్ టైమ్ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ ఫీట్ ను 25 రోజుల్లో సాధించాడు శివకార్తికేయన్. ఇక ఈ హీరో నటించిన మరొక సినిమా డాన్. ఈ సినిమాతో రెండవ సారి రూ. 100 కోట్ల వసూళ్లు అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన 12 రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. తాజాగా రామ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో వచ్చిన అమరన్ చిత్రంతో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు శివ కార్తికేయన్. కానీ ఈ దఫా కేవలం 3 రౌజుల్లోనే ఇంతటి భారీ కలెక్షన్స్ రాబట్టి తను నటించిన గత చిత్రాల హయ్యెస్ట్ కలెక్షన్స్ ను అతి తక్కువ కాలంలో బీట్ చేసాడు శివకార్తికేయన్.

Show comments