NTV Telugu Site icon

Amaran : రూ.100 కోట్ల క్లబ్ లో శివకార్తికేయన్ ‘అమరన్’

Amaran

Amaran

శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Gopichand : ‘నిన్న అమేజాన్ – నేడు ఆహా’లో ప్రత్యక్షమైన హిట్ సినిమా

వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అమరన్ అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100కోట్ల మార్కును దాటింది. శనివారం ఫస్ట్ షోస్ ముగిసే నాటికి ఈ ఫీట్ అందుకుంది అమరన్. మొదటి వీకెండ్ శనివారంనాడు అమరన్ కంప్లైట్ లీడ్ తీసుకుని అదరగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలో ఫ్యామిలీ ఆడియెన్స్ తో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి.  దీపావళి అడ్వాంటేజ్ ను అమరన్ కంప్లిట్ గా లీడ్  తీసుకుంది. కేరళ, కన్నడ లోను వీకెండ్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమాకు తెలుగు నాట పబ్లిసిటీ అంతంత మాత్రంగానే నిర్వహించారు. అయినా సరే కేవలం మౌత్ టాక్ తోపాటు కాస్త కూస్తో మార్కెట్ ఉన్న శివకార్తీకేయన్ కు సాయి పల్లవి క్రేజ్ తోడవడంతో ఆ ప్రభావం వసూళ్లలో కనిపించింది. నేడు ఈ సినిమాకు మరింత వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

Show comments