Amala Paul: బాయ్‌ఫ్రెండ్ లేడు, ప్రెగ్నెంట్ అయ్యా.. జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైందంటూ అమలాపాల్ షాకింగ్ కామెంట్స్!
- బాయ్‌ఫ్రెండ్ లేడు, ప్రెగ్నెంట్ అయ్యా
- జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైంది
- వివాహంపై అమలాపాల్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrologer Pediction About Amala Paul Marriage: హీరోయిన్ అమలాపాల్ తన వివాహం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఒక జ్యోతిష్యుడు తన పెళ్లి గురించి ముందే చెప్పాడని వెల్లడించారు. ఆ సమయంలో తనకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడని, అలాంటప్పుడు పెళ్లి ఎలా జరుగుతుందో అనుకున్నానని అమలాపాల్ తెలిపారు. చివరకు తన పెళ్లి విషయంలో జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైందని, ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
‘ఓ జ్యోతిష్యుడు నా పెళ్లి గురించి ముందే చెప్పాడు. ఆ సమయంలో నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు. అలాంటప్పుడు నా పెళ్లి ఎలా జరుగుతుందో అనుకున్నా. అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన కొద్ది రోజులకే గోవాలో జగత్ దేశాయ్‌ను కలిశా. అక్కడి నుంచి మా పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలానికే ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ సమయంలో పెళ్లి గురించి ఆలోచించకపోయినా.. అప్పుడున్న పరిస్థితుల్లో వివాహం తప్పనిసరి అయింది. మా జీవితంలో ఈ పరిణామాలు చాలా త్వరగా జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలు మన గమ్యాన్ని ఎలా మార్చేస్తాయో చెప్పాడని నేనే ఉదాహరణ. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా’ అని అమలాపాల్ చెప్పారు.
Also Read
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
Also Read: IND vs ZIM: జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్.. గట్టిగా కొడితేనే గట్టెక్కేది, భారత్ తుది జట్టు ఇదే!
అమలాపాల్ ఓ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోయారు. ఆ సమయంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. 2017లో విజయ్, అమలాలు తమ మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. ఆ సమయంలో అమలా ఎన్నో సమస్యలు, విమర్శలు ఎదుర్కొన్నారు. కెరీర్ కూడా అంతంతమాత్రంగానే సాగింది. అలాంటి సమయంలో అమలకు జగత్ దేశాయ్ పరిచయమ్యాడు. అమలకు అండగా నిలిచాడు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో.. 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2024లో కుమారుడు జన్మించాడు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!