Site icon NTV Telugu

Star Heroine: సీన్ కోసం 15 మంది పురుషుల ముందు నగ్నంగా నిలబడ్డాను..

Amamla Pall

Amamla Pall

చాలా మంది హీరోయిన్‌లు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేముందు వారికంటూ కొన్ని నియమాలు, కట్టుబాట్లు పెట్టుకుంటారు. కానీ సన్నివేశం డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడని నటి అమలా పాల్. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా.. తన అంద చందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి మెగా హీరోయిన్‌ అనే ట్యాగ్ కూడా చేసుకుంది. తమిళం, మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన కంటూ స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకుంది.

Also Read : Chiranjeevi : ‘చిరు – అనిల్ రావిపూడి’ మూవీ షూటింగ్ అప్ డేట్..!

ఇక తన ప్రోఫెషనల్‌లో అమలా పాల్ సన్నివేశం డిమాండ్ చేస్తే బట్టలు లేకుండా నటించడానికి కూడా రెడీ. అలా అమలా పాల్ ‘ఆమె’ చిత్రంలో ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఒంటిపై బట్టలు లేకుండా, పూర్తి నగ్నంగా యాక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది.‘ ‘ఆడై’ (ఆమె) షూటింగ్ సమయంలో 15 మంది పురుషులు నా చుట్టూ ఉన్నారు.ఆ షూటింగ్ సమయంలో వాళ్లందరినీ నా భర్తలగా భావించి నటించాను. లేకపోతే ఈ సీన్‌ను చేయలేకపోయే దాని. ఈ సీన్‌ను షూట్ చేయాల్సిన సమయంలో నగ్నంగా ఉండాలని నిర్మాతలు ముందుగా సమాచారం ఇచ్చారు. ఆ సన్నివేశం షూటింగ్ చేసే రోజు వచ్చినప్పుడు, నేను చాలా భయపడ్డాను. ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. సెట్స్‌లో ఏమి జరుగుతుందో, ఎవరు ఉంటారు, సెక్యూరిటీ ఉందో లేదో తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నాను. అక్కడ కెమెరామెన్, లైట్ బాయ్‌తో సహా సెట్‌లో 15 మంది మాత్రమే ఉన్నారు. నేను సిబ్బందిని నమ్మకపోతే, నేను ఆ సన్నివేశం చేసేదా నీ కాదు’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version