Site icon NTV Telugu

Amala : నా కోడళ్ల వల్ల లైఫ్ మారిపోయింది.. అమల కామెంట్స్

Amala Akineni

Amala Akineni

టాలీవుడ్‌ అందాల నటి, సీనియర్‌ యాక్ట్రెస్ అమల అక్కినేని ప్రస్తుతం సినిమాల కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన ఆమె, అప్పటి నుంచి కొత్త సినిమాలకు సైన్‌ చేయకపోయినా పబ్లిక్‌ లైఫ్‌లో చురుకుగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల అక్కినేని, తన కోడళ్లైన శోభిత ధూళిపాల (నాగ చైతన్య భార్య), జైనబ్ (అఖిల్‌ అక్కినేని భార్య) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

Also Read : Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !

అమల మాట్లాడుతూ.. “నాకు అద్భుతమైన కోడలు ఉన్నారు. వాళ్లు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు. వాళ్ల వల్ల నా జీవితం కొత్తగా మారిపోయింది. మా ఇంట్లో ఇప్పుడు నాకు ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది. అలాగే వారు ఇద్దరూ తమ కెరీర్‌ల్లో చాలా బిజీగా ఉంటారు, ఇది నిజంగా మంచి విషయం. యువత ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండటం చాలా అవసరం. వాళ్లు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లోనే బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి సరదాగా గడుపుతాం. నేను డిమాండ్‌ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్‌ చేసే భార్యను కూడా కాదు” అంటూ నవ్వుతూ చెప్పారు. అలాగే నాగ చైతన్య, అఖిల్‌ గురించి మాట్లాడుతూ.. “వాళ్ళు ఇద్దరూ మంచి ఆలోచనతో ఎదిగారు. నాగార్జున గారికి వాళ్లపై అపారమైన ప్రేమ ఉంటుంది. నేను నా బాధ్యతల పట్ల చాలా కచ్చితంగా ఉంటాను. పిల్లల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండను. నా కుటుంభం పిల్లలు తర్వాతే వేరే ఏదైనా. ఇప్పటికైతే నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది” అంటూ చెప్పుకొచ్చింది అమల. మొదటి సారిగా తన కోడల‌పై స్పందించడంతో ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version