SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్‌’ షూటింగ్ స్టార్ట్

Sivakarthikeyan

Sivakarthikeyan

 ‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరో శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్  ‘సెయాన్‌”. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైంది. ‘అమరన్’ సంచలన విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి.

‘తాయ్ కిళవి’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్ మరిముత్తు  ‘సెయాన్‌’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన టాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ మరియు పీరియాడిక్ ఎలిమెంట్స్ కలబోసిన ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథ సాగనుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను మదురై, చెన్నై పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈరోజు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ వన్ విజన్.. వన్ జర్నీ  అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో శివకార్తికేయన్ పోస్టర్‌ను విడుదల చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా  విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.