ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ రిలీజ్ పుష్ప -2.సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన రికార్డ్స్ లో కొన్ని ఇవే
* మొదటిసారి భారతదేశ సినీ చరిత్రలోనే మూడు రోజుల్లో రూ .640 కోట్ల వసూళ్లతో రికార్డు సాధించిన పుష్ప 2.
* మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ రూ. 500 కోట్ల వసూలు చేసిన హీరోగా అల్లు అర్జున్.
* హిందీ సినిమాల చరిత్రలోనే ఇంతవరకు లేని రికార్డును సాధించిన అల్లు అర్జున్.
* ఇప్పటివరకు షారుక్ జవాన్ సినిమా రూ . 65 కోట్లు రికార్డు ఉండగా ఇప్పుడు మొదటి రోజే రూ. 72 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును తిరగరాసింది.
* రెండవ రోజు రూ. 59 కోట్లు వసూలు చేయగా మూడవరోజు రూ. 74 కోట్ల వసూళ్లతో మరోసారి తన మొదటిరోజు రికార్డు మించి వసూలు చేసింది.
* ఒకటే సినిమా హిందీలో రెండు సార్లు హైయెస్ట్ వసూలు చేసిన సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది.
* భారతదేశ సినీ చరిత్రలోని రికార్డ్ లన్ని ఇప్పుడు అల్లు అర్జున్ పేరిట నమోదవుతున్నాయి. ఇది ఇలాగే జరిగితే మరో మూడు నాలుగు రోజుల్లో అల్లు అర్జున్ రూ . 1000 కోట్లు వసూలు చేసే అవకాశం చాలా క్లియర్ గా ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
* ఇది ఇలాగే సాగితే ఎవరికి అందనంత ఉన్నత స్థాయికి అల్లు అర్జున్ వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
* ఇదిలా ఉండగా పుష్ప -2 బుకింగ్స్ పరంగాను, బుక్ మై షోలో సేల్స్ పరంగాను నం -1 ప్లేస్ కు చేరుకునేందుకు అడుగు దూరంలో ఉంది. లాంగ్ రన్ లో ఆ అవకాశం లేకపోలేదని ట్రేడ్ టాక్