NTV Telugu Site icon

AlluArjun : మతి పోగొడుతున్న పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్..?

Pushpa 2

Pushpa 2

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల పంతులు సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప -2. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.అందుకు అనుగుణంగా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు యూనిట్. పుష్ప – 2 ఫస్ట్ హాఫ్ వర్క్ మొత్తం కంప్లిట్ చేసి లాక్ చేసి ఉంచి సెకండ్ హాఫ్ వర్క్ ను జెట్ స్పీడ్ లో రెడీ చేస్తున్నారు.మరోవైపు పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయికీ చేరుకుంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసేసీసారు మేకర్స్. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి సేల్స్ జరిగాయని తెలుస్తోంది.  ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప -2 ప్రీ రిలీజ్ వివరాలు పరిశీలిస్తే..

ఆంధ్ర / తెలంగాణ – రూ. 220 కోట్లు

హిందీ – రూ. 200 కోట్లు

తమిళనాడు – రూ. 50 కోట్లు

కర్ణాటక – రూ. 30 కోట్లు

కేరళ – రూ. 20 కోట్లు

ఓవర్సీస్ – రూ. 120 కోట్లు

మొత్తం థియేట్రికల్ రైట్స్ – రూ. 640 కోట్లు

నెట్‌ఫ్లిక్స్ -రూ. 275 కోట్లు

మ్యూజిక్ రైట్స్ – రూ. 65 కోట్లు

శాటిలైట్ రైట్స్ – రూ. 85 కోట్లు

మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ – రూ. 425 కోట్లు

మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ – రూ. 1,065 కోట్లు. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

NOTE : వివిధ మాధ్యమాల ద్వారా అందిన వివరాలను మాత్రమే మేము వెల్లడించాము. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించబోబు