NTV Telugu Site icon

Allu Arjun : హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌..

Bunni

Bunni

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ గడచిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవి తరపున ప్రచారం నిర్వహించేందుకు నంద్యాలలో ఎన్నిల ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారీ జనసందోహం గుమికూడేలా చేసారని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. పుష్పా -2 షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ మధ్యలో నంద్యాలకు వెళ్లిన బన్నీని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు. ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ హంగామా సృష్టించారు బన్నీ.

Also Read : Jr.NTR : దేవర 3 వారాలు కంప్లిట్.. లెక్కలేనన్ని రికార్డులు..

నంద్యాల పోలీసుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో పోలీసులు అల్లు అర్జున్ పైకేసు నమోదు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్‌తో పాటు వైసీపీ నాయకుడు శిల్పారవిపై నంద్యాల పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారని కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో నాడు నంద్యాలలో  ఎన్నికల సమయంలో తన మీద నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్‌ ఏపీ హై కోర్టును ఆశ్రయించాడు. తనపై పెట్టిన కేసు లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసు విచారణకు ముందే కేసును రద్దు చేయాలని బన్నీ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.