NTV Telugu Site icon

AlluArjun : పుష్ప -2 ట్రైలర్ ఏ ఏ భాషల్లో ఎక్కడెక్కడ రిలీజ్ కానుందో తెలుసా..?

Pushpa Events

Pushpa Events

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. కాగా నేడు పుష్ప లాంఛ్ పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్.

Also Read : Jayam Ravi : దీపావళి డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

కాగా నేడు విడుదల కానున్న పుష్ప 2 ట్రైలర్ ఊహుంచిన దాని కంటే భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇంతటి భారీ ట్రైలర్ ను వివిధ భాషల్లో వివిధ హ్యాండిల్స్ లో రిలీజ్ చేస్తోంది మైత్రీ. అందుకు సంబంధించి ఏ ఏ భాషల్లో ఎక్కడెక్కడ విడుదల అవుతుంది అనేది తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఒకసారి ఆ పోస్టర్ ను పరిశీలిస్తే తెలుగులో నిర్మాన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేస్తుండగా, తమిళ్ ట్రైలర్ ను AGS ఎంటర్టైన్మెంట్స్, కన్నడ అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్, మలయాళం E 4 ఎంటర్టైన్మెంట్స్, ఇక బాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ సంస్థ T సిరీస్ రిలీజ్ చేస్తుండగా బెంగాలీ ట్రైలర్ ను అఫిషియల్ T సిరీస్ బంగ్లా యూట్యూబ్ ఛానెల్స్ లో సాయంత్రం 6.03 గంటలకు పుష్ప ది రూల్ ట్రైలర్ విడుదల కానుంది.ఇక డిసెంబరు 5న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

Show comments