Allu Arjun’s Raaka Movie Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘రాకా’. ఈ సినిమా అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా తదుపరి కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎంట్రీ సీన్స్ కోసం మేకర్స్ భారీ స్థాయిలో సెట్‌ను కూడా వేశారట. ఇందులో బన్నీ వైల్డ్ లుక్‌లో కనిపించబోతున్నట్లు టాక్. ఈ సీన్‌ను సినిమాకే హైలైట్‌గా నిలిచేలా అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట.
అట్లీ మార్క్ స్టైలిష్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్‌తో అల్లు అర్జున్ ఎంట్రీ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ఇప్పటివరకు కనిపించని లుక్‌లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్‌లో ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ స్టైల్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయని సమాచారం. ‘పుష్ప’ తర్వాత మరోసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో బన్నీ కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రంలో ఇతర కీలక హీరోయిన్లుగా నటిస్తున్నారట. అలాగే రష్మిక మందన్న నెగెటివ్ రోల్ చేస్తున్నట్టుగా టాక్.

