“పుష్ప” నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని , అందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని స్టైలిష్ స్టార్ తో స్టెప్పులు వేయనుందని అనే వార్తలు విన్పిస్తున్నాయి.
Read Also : “బీస్ట్”గా విజయ్… ఇళయ దళపతి లుక్ అదుర్స్
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
తాజా అప్డేట్ ఏమిటంటే… ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరగనుందట. సమాచారం ప్రకారం గోవాలో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట మేకర్స్. జూలై 5న ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే సుకుమార్ లొకేషన్లను కూడా ఫిక్స్ చేశారట. ఈ అందమైన గోవా లొకేషన్లు సినిమాలో ప్రేక్షకులకు కన్నుల విందు చేయనున్నాయి. అంతేకాదు ఈ షెడ్యూల్లో పుష్ప రాజ్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ ను కూడా చిత్రీకరించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. పుష్ప గోవా షెడ్యూల్ తరువాత అల్లు అర్జున్ ఆగస్టులో “ఐకాన్” షూట్లో చేరే అవకాశం ఉంది. అయితే, ఐకాన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..