NTV Telugu Site icon

Allu Arjun: బన్నీ మెప్పిస్తాడా..? చిరు, మహేష్, దేవర కొండ ను మించి చేస్తాడా..!

Allu Arjun

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రెడ్ బస్ యాడ్ లో నటించిన బన్నీ మరో యాడ్ లో కనిపించబోతున్నాడు. ‘థమ్స్ అప్’ యాడ్ బన్నీ చేతికి వచ్చింది. బన్నీ ఈ యాడ్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read also: IMD Warning: ఐంఎండీ కీలక హెచ్చరిక.. నేడు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు..

గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు థమ్స్ అప్ యాడ్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించి.. సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ యాడ్ లో బన్నీ మెరవబోతున్నాడు. తమ హీరో అరుదైన ఘనత సాధించడంతో పాటు క్రేజ్ పెరిగిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యాడ్ లో బన్నీ ఏ రేంజ్ స్టంట్స్ చేస్తాడో అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో మరో ఘనత సాధించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీ ఈ యాడ్ లో అందరిని మెప్పిస్తాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పుష్ప అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే డైలాగ్ తగ్గేదే లే.. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరి నోట వస్తున్న మాటే.. ఇదే డైలాగ్ థమ్స్ అప్ యాడ్ లో వాడుకుంటారా? అనే మాటలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం అలా ఏమీ ఉండదు.. ఈ యాడ్ లో వెరైటీ స్టంట్ చేసి బన్నీ అందరిని మెప్పిస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఐకాన్ స్టార్ పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొంటుండగా.. త్వరలోనే షూటింగ్‌ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి ప్రమోషన్స్‌ను చేపట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Nagarjuna Sagar: నిండు కుండలా సాగర్.. 26 గేట్లు ఓపెన్‌

Show comments