NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప -2 ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

Psuhspa

Psuhspa

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్  మూడు యూనిట్స్ తో చక చక ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుక్కు. పుష్ప -2 డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Also Read : Jr.NTR: దేవర ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..?

కాగా పుష్ప – 2 ఎటువంటి పోటీ లేకుండా అత్యధిక థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్ప – 2 కు సోలో రిలీజ్ దొరికింది. ఈ సినిమాకు పోటీగా మారే ఇతర సినిమాలను సైతం వేసేందుకు వెనకడుగు వేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు పుష్ప – 2 రేంజ్ ఏపాటిదో. కాగా దేవర రిలీజ్ విషయంలో ఓవర్సీస్ తో పాటు తెలుగు స్టేట్స్ ఒకేసారి ప్రీమియర్స్ ఎలా అయితే వేసారో అదే ట్రెండ్ ను పుష్ప – 2 కు ఫాలో చేయాలని చూస్తున్నారు మేకర్స్. డిసెంబరు 6న రిలీజ్ అయితే ముందు రోజు అంటే డిసెంబరు 5న రాత్రి 9.30 నిముషాలు నుండి కంటిన్యూ ఆటలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు. అంటే ఓవర్సీస్ కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో షోస్ పడతాయి. టాక్ బాగుంటే ఇక పుష్ప – 2 తొలి రోజు రికార్డు స్థాయి నంబరు వచ్చే అవకాశం ఉంది.

Show comments