NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప – 2 కోసం తమన్ ను ఎందుకు తీసుకున్నారు..?

Sukku Devi

Sukku Devi

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని శ్రీలీల, బన్నీ పై వచ్చే స్పెషల్ సాంగ్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మరో నాలుగు రోజులు పాటు ఈ షూట్ జరగనుంది. త్వరలోనే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలిజ్ చేయనున్నారు మేకర్స్.

Also Read : Kiran Abbavaram : ‘క’ ఓటీటీ రిలీజ్ పై వాళ్లు అలా.. నిర్మాత ఇలా..

కాగా ఈ సినిమా విషయంలో ఇప్పుడు దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు తెలుస్తోంది. వివరాలలోకెళితే పుష్ప -2 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవిశ్రీని తప్పించి మరో సంగీత దర్శకుడిని తీసుకున్నారు మేకర్స్. అతడే టాలీవుడ్ సెన్సేషన్ SS.థమన్. రాబోతున్న పుష్ప -2 కు ఈయనే బీజీమ్ అందిస్తున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమాలు అంటే దేవిశ్రీ తప్ప మరొక పేరు వినిపించదు. తోలి సినిమా ఆర్య నుండి మొన్న వచ్చిన పుష్ప పార్ట్ – 1 వరకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కానీ మొదటి సారి సుక్కు దేవిని పక్కన పెట్టి వేరే సంగీత దర్శకులను తీసుకోవడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశం గా మారింది. దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పట్ల సుకుమార్ సంతృత్తి చెందలేదని అందుకే తమన్ ను తీసుకువచ్చారని టాలీవుడ్  వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని వేరే లెవల్ కు చేర్చే తమన్ ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీకి  ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.

Show comments