అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఎంత పెద్ద హెడేక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 2000 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థాంక్స్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈవెంట్ జరగబోతోంది. అయితే రేపు ఉదయాన్నే అల్లు అర్జున్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బన్నీ వాసు వెల్లడించారు. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది కానీ ఆయనకు ఆరోజు అస్వస్థత ఏర్పడడంతో ఈవెంట్ కి హాజరు కాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన రేపు ఉదయాన్నే వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నారు. నిజానికి పుష్ప 2 రిలీజ్ తర్వాత ఆయన వెకేషన్ కి వెళ్లాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆయన దాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయన వెకేషన్ కోసం సిద్ధమవుతున్నారు.