Site icon NTV Telugu

AlluArjun : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌ను ఆపేసిన సెక్యూరిటీ.. ఫ్యాన్స్‌ షాక్!

Allu Arjun

Allu Arjun

పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌కి ముంబై ఎయిర్‌పోర్టులో ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది. అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ కోసం ముంబై చేరుకున్న బన్నీ, సాధారణ ప్రయాణికుడిలా కళ్లజోడు, మాస్క్ ధరించి ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టారు. కానీ చెకింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీ ఆయనను గుర్తించలేదు. పక్కన ఉన్న అసిస్టెంట్‌ వెంటనే ‘ఈయన అల్లు అర్జున్‌ గారు’ అని చెప్పినా, సెక్యూరిటీ మాత్రం తన డ్యూటీకి కట్టుబడి ‘ముఖం చూపించాలి’ అని గట్టిగా అన్నాడు.

Also Read : Tollywood strike : చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. ఫెడరేషన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యాలు

మరు క్షణమే బన్నీ కళ్లజోడు, మాస్క్ తీసి చిరునవ్వుతో తన ముఖం చూపించగా, అక్కడున్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ సన్నివేశం చూసి పక్కన ఉన్న ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, నెటిజన్లు ‘సెక్యూరిటీ తన పని బాగా చేశాడు’ అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ‘స్టార్‌కి కూడా సాధారణ ప్రయాణికుడిలానే రూల్స్ వర్తిస్తాయి..అదే నిజమైన ప్రొఫెషనలిజం’ అంటున్నారు. ఇక ఈ సంఘటతో ఆయన సరదా తనం, సింపుల్ నేచర్‌కి ఇది మరో నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు.

 

Exit mobile version