Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raaka Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మూవీ కోసం బన్నీ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ప్రాఫిట్ షేరింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘రాకా’కు అల్లు అర్జున్ ఫిక్స్డ్ రెమ్యునరేషన్‌కు బదులుగా ప్రాఫిట్ షేరింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఆయన రెమ్యునరేషన్‌ను ఫిక్స్ చేసుకున్నారట.
ఈ మూవీ భారీ సక్సెస్ సాధిస్తే బన్నీకి ఏకంగా రూ.300 కోట్ల వరకు అందే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ మొత్తం అధికారికంగా ధృవీకరించబడలేదు. మరోవైపు ‘రాకా’ బడ్జెట్ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని టాక్. ఇందులో దాదాపు 50 శాతం షూటింగ్ దశలోనే ఖర్చయిందనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో మేకర్స్‌పై ఆర్థిక భారం తగ్గించేందుకు అల్లు అర్జున్ ప్రాఫిట్ షేరింగ్‌కు మొగ్గుచూపినట్లు సమాచారం. ఇక సినిమాలో దీపిక పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంటడం, సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుండటం, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో ‘రాకా’పై క్రేజ్ మరింత పెరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం బన్నీ కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Also Read
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
- Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. '90స్' డైరెక్టర్‌పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
- Ranveer - Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్!
- YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
తాజావార్తలు
-
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
-
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
-
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!