Allu Arjun : అల్లు అర్జున్ అట్లీ మూవీలో మృణాల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే జనాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప2’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టి, ఏకంగా రూ.1800 కోట్లు వసూలు చేసి దాదాపు ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేశాడు. జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి సంచలనాలకి తెర లేపాడు. దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక వరుస దర్శకులతో కమిట్ మెంట్ అయినన్నటికి మొదటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో రాబోతున్నాడు బన్నీ. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా, ఇండియాలో ఇప్పటి వరకు రాని జోనర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. మూవీకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే..
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీలో, కథ రీత్యా ముగ్గురు కథానాయికలు కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అందులో ఓ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ను రంగంలోకి దించనున్నారని సమాచారం. అంతేకాదు ఇప్పటికే ఆమెతో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని.. ఇటీవల తను లుక్ టెస్ట్ లో పాల్గొందని తెలుస్తోంది. అలాగే మరోవైపు మిగిలిన రెండు నాయికా పాత్రల కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, దీపికా పదుకొణె పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇప్పటికే జాన్వీతో చర్చలు పూర్తయ్యాయని.. దీపికతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. కాగా త్వరలోనే ఈ వార్త పై స్పష్టత వచ్చే అవకాశముంది.
Also Read
- Tags
- Allu Arjun
- Atlee
- Mrunal
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..