Site icon NTV Telugu

Pushpa – 3 : బన్నీ బిజీ.. పుష్ప – 3 పనులు స్టార్ట్ చేసిన సుకుమార్?

Pushpa 3

Pushpa 3

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప, పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.

Also Read : Karthi : లోకేష్ కనకరాజ్ పై అసంతృప్తి.. సూపర్ హిట్ సీక్వెల్ నుండి కార్తీ ఔట్..

కాగా పుష్ప – 2 ఎండ్ లో సెకండ్ పార్ట్ కు సీక్వెల్ గా పుష్ప 3 ఉందని అనౌన్స్ చేసాడు సుకుమార్. కానీ ఈ సినిమా ఉండదు, ఎదో హైప్ కోసం పార్ట్ 3 అని వేశారని కామెంట్స్ వినిపించాయి. కానీ దుబాయ్ లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ కార్యక్రమంలో సుకుమార్ పుష్ప 3 కన్ఫామ్ గా ఉంటుందని చెప్పారు. కానీ ఎప్పుడో చెప్పలేదు. అటు అల్లు అర్జున్ కూడా అట్లీ, లోకేష్ కనకరాజ్ సినిమాలతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నెసాడు. అటు సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేస్తున్నాడు. మరి పుష్ప 3 ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. సుకుమార్ టీమ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు స్టార్ట్ చేశారట. హైదరాబాద్‌లోని ఒక ఆఫీస్‌ను తీసుకుని బన్నీ, సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల విరామ సమయంలో పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు చేస్తున్నారట. మరి సుక్కు, బన్నీ పుష్ప 3 ని సెట్స్ పైకి తీసుకువెళ్తారో, ఎప్పడూ రిలీజ్ చేస్తారో వెయిట్ అండ్ వాచ్.

Exit mobile version