Allu Arjun-Ram Charan: అల్లు వారి ఇంట ‘పెళ్లి సందడి’.. అల్లు అర్జున్‌-రామ్ చరణ్ పార్టీ అదిరింది!

  • అల్లు వారి ఇంట పెళ్లి సందడి
  • త్వరలో వివాహ బంధంలోకి హీరో అల్లు శిరీష్
  • అల్లు అర్జున్ తన నివాసంలో ప్రైవేట్ పార్టీ
  • ప్రధాన ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన
Allu Arjun Ram Charan

Allu Arjun Ram Charan

Allu Sirish-Nayanika Reddy Wedding: ప్రస్తుతం అల్లు వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు.. హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 6న నయనిక రెడ్డితో శిరీష్ వివాహం జరగనుంది. ఈ వేడుకలను పురస్కరించుకుని అల్లు అర్జున్ తన నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల కోసం ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఇటీవల కవల పిల్లలకు తల్లిదండ్రులైన చరణ్-ఉపాసన జంట, కుటుంబ వేడుకలో ఇలా ఉత్సాహంగా కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ఈ పార్టీలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు అతిథులకు సాదర స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో రామ్, ఉపాసన దంపతులతో పాటు.. సుస్మిత, నిహారిక స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

Also Read: KH x RK Reunion: ఇంతకీ ఎవరు హీరో?.. రజనీ-కమల్ స్పెషల్‌ వీడియో అదిరిందిగా!

ఈ పార్టీలో తేజా సజ్జా, వైష్ణవ్‌ తేజ్‌, సిద్ధు జొన్నలగడ్డ, సుశాంత్‌, కృతి శెట్టి, నేహా శెట్టి, రాశీ ఖన్నా, నభా నటేష్‌ కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలలో రామ్ చరణ్ క్లాసీ లుక్‌లో కనిపించగా.. ఉపాసన ట్రెడిషనల్ వేర్‌లో మెరిసిపోయారు. మరోవైపు అల్లు అర్జున్ తన కుటుంబంతో గడుపుతున్న ఈ సంతోషకరమైన క్షణాలను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో.. ‘ఇది మెగా-అల్లు బాండింగ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.