NTV Telugu Site icon

Allu Arjun : నేషనల్ అవార్డుపై అల్లు అర్జున్ కామెంట్స్.. మరో మెట్టు ఎక్కేశావ్ బాసూ!

National Awards

National Awards

తెలుగులో హీరోగా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ఆయన హీరోగా నటించిన పుష్ప మొదటి భాగానికి గాను గతంలో నేషనల్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ నేషనల్ అవార్డు గురించి తాజాగా ఆయన హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన చేసిన కామెంట్లు గురించి ఈ మధ్య ట్రోలింగ్ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన అవార్డు అనౌన్స్ చేసినప్పుడు తాను ఈ అవార్డు అందుకుంటున్న మూడో నటుడునో లేక నాలుగో నటుడినో అనుకున్నాను కానీ నేనే మొదటి నటుడిని అని తెలిసి షాక్ అయ్యాను అంటూ కామెంట్ చేసినట్లు పేపర్ క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి.

Allu Arjun: మహేష్ బాబు అందం.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇప్పటివరకు తెలుగు నటుడికి నేషనల్ అవార్డు రాలేదని విషయం తెలిసి మార్క్ చేసుకుని టార్గెట్ చేసి మరీ ఈ అవార్డు సాధించానని అనడంతో రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నాడు అనే విషయం మీద ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్లో మాత్రం నేషనల్ అవార్డు గురించి ఇప్పటివరకు నేను ఎప్పుడూ చెప్పలేదు అంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని అల్లు అర్జున్ షేర్ చేసుకున్నారు. అదేంటంటే నేను నా నేషనల్ అవార్డుని మా తెలుగు హీరోలు అందరికీ డెడికేట్ చేయాలనుకుంటున్నాను అని అన్నారు. ఆ మాట వినగానే నందమూరి బాలకృష్ణ ఇటు రా బ్రదర్ అంటూ పిలిచి మరి ఒక ఆలింగనం చేసుకొని భుజం తట్టారు. అది నేను సాధించడం వల్ల అంతమంది నటులలో నేను ఒక్కడినే నటుడిని అని కాదు మీ అందరి తరపున మాకు వచ్చింది అని నేను చూస్తున్నాను అని అనడంతో ఒక్కసారిగా అందరూ భలే ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇక ఈ వీడియో మీద అందరూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం .

Show comments