Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వ్యక్తిగతంగా కాకుండా ముంబై (బాంబే) నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ న్యాయస్థాన విచారణలో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణకు సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ గతంలోనే కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా తాను వ్యక్తిగతంగా రాలేకపోతున్నానని అల్లు అర్జున్ కోర్టుకు వివరించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు, ఆన్లైన్ ద్వారా హాజరుకావడానికి అనుమతిని మంజూరు చేసింది.
డిసెంబర్ 2024 లో విడుదలైన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీ ఎత్తున అభిమానులు గుమిగూడారు. అల్లు అర్జున్ అక్కడకు వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ విషాద ఘటనపై నమోదైన కేసులోనే నాంపల్లి కోర్టు ఇప్పుడు వరుస విచారణలు జరుపుతోంది. ముంబై షూటింగ్లో బిజీగా ఉంటూనే అల్లు అర్జున్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అటెండ్ కావడం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
-
Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..
-
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!