Site icon NTV Telugu

A22 x A6: హైదరాబాద్‌ చేరుకున్న అట్లీ.. ఐకాన్‌స్టార్‌తో ప్రీ-ప్రొడక్షన్ డిస్కషన్స్‌

Allu Arjun

Allu Arjun

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, పాన్‌ ఇండియా సూపర్‌ డైరెక్టర్ అట్లీ కలయికలో ఓ బ్లాక్‌బస్టర్ మూవీ రూపొందుతోందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం ఇండియన్ సినీ లవర్స్‌తో పాటు గ్లోబల్‌గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అట్లీకి ఇది ఫస్ట్ తెలుగు మూవీ కాగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సమర్పణలో ఈ భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కనుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నీషియన్స్, డైరెక్టర్ అట్లీతో షూట్ చేసిన స్పెషల్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి అందర్నీ షాక్‌కు గురిచేశారు.

Also Read:Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ కానప్పటికీ, మూడు సూపర్ పవర్‌ఫుల్ ఫోర్సెస్ ఈ ప్రాజెక్ట్‌లో జతకడుతున్నాయి: జవాన్, థెరి, బిగిల్, మెర్సల్ లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అట్లీ, ‘పుష్ప’తో గ్లోబల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని నేషనల్ అవార్డ్ విన్నర్‌గా నిలిచిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, ఇండియాలో టాప్ మీడియా హౌస్ అయిన సన్ పిక్చర్స్. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ అట్లీ బుధవారం (మే 21, 2025) హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఐకాన్‌స్టార్‌తో కలిసి ప్రీ-ప్రొడక్షన్ డిస్కషన్స్‌లో పాల్గొననున్న అట్లీ, జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు.

Also Read:Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచిన అన్నదమ్ములు..

ప్రాజెక్ట్ A22 x A6గా పిలుస్తున్న ఈ చిత్రం ఇండియన్ వాల్యూస్‌తో కూడిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. భావోద్వేగాలు, మాస్ యాక్షన్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ మూవీ ఇంటర్నేషనల్ అప్పీల్‌తో ఓ ఐకానిక్ సినిమాగా నిలవనుందని టాక్. స్పెషల్ వీడియో చూసిన ఫ్యాన్స్, అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో మ్యాజిక్ జరగబోతోందని, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయనుందని ఫీలవుతున్నారు. అట్లీ తొలి తెలుగు పాన్‌ ఇండియా మూవీగా ఇది సంచలనం సృష్టించనుంది. నటీనటులు, టెక్నికల్ టీమ్, రిలీజ్ డేట్ వంటి డీటెయిల్స్ త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.

Exit mobile version