Site icon NTV Telugu

Bunny Vasu : అల్లు అర్జున్ – అట్లీ సినిమా మా చేతుల్లో లేదు

Aa 22

Aa 22

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పాడుకొనే,  మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Also Read : Bollywood : నేపో కిడ్స్ పనైపోయింది.. ప్రతిభకు పట్టం కడుతున్న బాలీవుడ్ ఆడియెన్స్..

తాజాగా కన్యాకుమారి సినిమా ఈవెంట్ లో పాల్గొన్న బన్నీ వాసు.. అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు సంబంధించి మాట్లాడుతూ ‘అట్లీ సినిమా అప్ డేట్ లు ఏమైనా సరే నిర్మాతలైన సన్ పిచర్స్ వాళ్ళు మాత్రమే చెప్పాలి. గీతా ఆర్ట్స్ నుండి కానీ, బన్నీ తరపువాళ్లు కానీ చెప్పకూడదని సన్ పిక్చర్స్ తో నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా విషయంలో మా చేతులు కట్టేశారు. ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న బంద్ వలన మాకు భారీ నష్టం వచ్చింది. ఆ సమ్మె వల్ల ఫారిన్ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులను కూడా ఖాళీగా ఉంచేయాల్సి వచ్చింది. ఇప్పుడు షూట్ మళ్లీ మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ ను ఎక్కడ బ్రేక్ లేకుండా చేసేలా ప్లానింగ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇక మా గీత ఆర్ట్స్ సంస్థ నుంచి త్వరలో రెండు మంచి అన్నౌన్స్ మెంట్ లు రాబోతున్నాయి. వాటి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తాం’ అని అన్నారు.

Exit mobile version