Jani Master: జానీ మాస్టర్ కోసం అల్లు అర్జున్ & కో వెయిటింగ్!!
- జానీ మాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్ పేరు
- తాజాగా స్పందించిన పుష్ప 2 నిర్మాత రవిశంకర్
- జానీ మాస్టర్ కోసం పుష్ప 2 టీం వెయిటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun and Team Pushpa 2 Waiting for Jani Master: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ఎంత హార్ట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా జానీ మాస్టర్ కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మత్తు వదలరా 2 సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఒక రిపోర్టర్ జానీ మాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి దీనిమీద మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరని అడిగితే దానికి రవిశంకర్ స్పందించారు. ఇది జానీ మాస్టర్ సదరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వ్యక్తిగతమైన విషయం అని ఆయన అన్నారు. పుష్ప 2 మొదలైనప్పుడు ఆమె అడిషనల్ కొరియోగ్రాఫర్ గా సినిమాకి పనిచేసేదని, సినిమాలోని అన్ని పాటలకు జానీ మాస్టర్ తో పాటు ఆమె కూడా పనిచేసేదని చెప్పుకొచ్చారు. సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయని అక్టోబర్ 15 తర్వాత పాటలు షూటింగ్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
Jayam Ravi: ఆ సింగర్ తో అఫైర్.. పెదవి విప్పిన జయం రవి
Also Read
నిజానికి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయాల్సి ఉంది అది జానీ మాస్టర్ తోనే చేయించాలని అనుకున్నాం ఇంకా రెండు రోజుల్లో షూటింగ్ జరగబోతుంది అనగా ఈ తతంగం అంతా జరిగిపోయింది. ఇప్పుడు జానీ మాస్టర్ కోసం ఎదురు చూస్తున్నాం ఒకవేళ ఆయన షూటింగ్స్ లో పాల్గొనకూడదు లాంటి ఏమైనా ఆంక్షలు ఉంటే అప్పుడు మరో ఆప్షన్ కి వెళతామంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే బాధితురాలి పేరు ఎక్కడా మెన్షన్ చేయకూడదు కాబట్టి నేనేమీ చెప్పట్లేదు కాకపోతే మేము గతంలో పుష్ప 2 సినిమా నుంచి రిలీజ్ చేసిన లిరికల్ వీడియోస్ లో సైతం ఆమె పేరు ఉంది. ఆమె మాతో పని చేసేది, జానీ మాస్టర్ కూడా పనిచేసేవారు. వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం చాలా దూరం వెళ్ళిపోయింది. దానిమీద నేనేమీ కామెంట్ చేయలేను అన్నట్టుగా అయినా మాట్లాడారు. అయితే అల్లు అర్జున్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనే విషయం మీద మాట్లాడుతూ ఎప్పుడైనా డాన్సర్లు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ లాగా విష్ చేస్తే తిరిగి విష్ చేయడం తప్ప అల్లు అర్జున్‌కి వాళ్ళు ఎవరో కూడా గుర్తుండరని చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ ని వెనక్కి లాగి ఆమెను ప్రమోట్ చేయాలనుకునే ఉద్దేశం కూడా అల్లు అర్జున్‌కి లేదని ఈ సందర్భంగా ఆయన శంకర్ తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!