NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప -2 తర్వాత బన్నీసినిమా ఆ దర్శకుడితోనే..

Untitled Design (41)

Untitled Design (41)

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  సుకుమార్ దర్శకత్వంలో పుష్ప – 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్పకి కొనసాగింపుగా పుష్ప – 2 రానుంది. రష్మిక మందాన అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తోంది.  వాస్తవానికి ఈ సినిమా మొదటగా ఈ సినిమా ఆగస్టులో విడుదల  కావాల్సి  ఉండగా పలు కారణాలు వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 6న గ్రాండ్ గా విడుదల కానుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Also Read : Koratala Siva : దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించే హీరో ఇతనే..?

ఇదిలా ఉండగా  పుష్ప  తర్వాత బన్నీ ఏ సినిమా చేయనున్నాడు అనేది అందరీ మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు అట్లీ, వెట్రిమారన్ పేర్లు వినిపించాయి. అట్లీతో సినిమా దాదాపు ఒకే అయిందని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో బన్నీతదుపరి చిత్రంపై  బన్నీ యూనిట్ వర్గాలనుండి ఓ సమాచారం అందుతోంది. పుష్ప – 2 పూర్తి చేసిన తర్వాత బన్నీ త్రివిక్రమ్ తోనే పని చేయనున్నట్లు తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, అత్యంత భారీ బడ్జెట్ పై ఈ చిత్రం రానుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్  చేయబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో ఈ చిత్రాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ గానే నిలిచాయి. మరి ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో వేచి చూడాలి.

Show comments