NTV Telugu Site icon

Allari Naresh : వరల్డ్ వైడ్ బచ్చల మల్లి డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు ఇవే

Bacchalamalli (3)

Bacchalamalli (3)

అల్లరి నరేష్ ఇటీవల కథా నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు. నాంది, ఉగ్రం, మారేడుమల్లి ప్రజానీకం ఈ కోవాలోనివే. ఆ ఒక్కటి అడక్కు వంటి ప్లాప్ తర్వాత మరోసారి బచ్చల మల్లి అనే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాడు.ఈ దఫా ఎలాగైన హిట్టు కొట్టాలనే కసిగా ఉన్నారు అల్లరి నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది బచ్చల మల్లి.

also read : Pushpa2TheRule : ఏపీలో పుష్ప-2 టికెట్స్ ధరల వివరాలు ఇవే.!

తాజగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కాగా ఈ సినిమాను వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసుకుందాం రండి. ముందుగా ఆంధ్రాలోని ఉత్తరాంధ్రలోsvc ఫిల్మ్స్, ఈస్ట్ గోదావరి – శ్రీ పాద ఫిల్మ్స్, వెస్ట్ గోదావరి – ఉష పిచ్చర్స్, గుంటూరు – రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ – ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరు – హరి పిచ్చర్స్ ద్వారా రిలీజ్ కానుంది. సీడెడ్ ఏరియాలో జెపిఆర్ ఫిల్మ్స్ విడుదల చేస్తున్నారు. ఇక నైజాంలో గ్లోబల్ సినిమాస్ బచ్చల మల్లి ని పంపిణి చేస్తోంది. అలాగే కర్ణాటకలో బెంగళూరు కుమార్ ఫిల్మ్స్, చెన్నైలో మూవీస్ రిలీజ్ చేస్తుండగా ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా గ్రాండ్ర్ రిలీజ్ కానుంది. డిసెంబరు 20న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

Show comments