Site icon NTV Telugu

Allari Naresh : అల్లరోడి సితార సినిమా షూటింగ్ అప్ డేట్..రిలీజ్ ఎప్పుడంటే.?

Untitled Design (55)

Untitled Design (55)

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ప్రారంభించాడు. ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

కాగా నేడు చిత్రబృందం అధికారికంగా పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించింది. “ఫ్యామిలీ డ్రామా” చిత్రంతో ప్రశంసలు అందుకున్న రచయిత, దర్శకుడు మెహర్ తేజ్ అల్లరి నరేష్ద చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సరికొత్త కథాశంతో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బచ్చలమల్లి అనే చిత్రంలో నటిస్తున్నాడు అల్లరి నరేష్.

రుహాని శర్మ ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన జోడిగా నటించనుంది. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.జిజు సన్నీ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, రామకృష్ణ అర్రం ఎడిటర్ గా, విశాల్ అబానీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

Also Read: Vijay Antony: బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది..

Exit mobile version