టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పర్చుకున్న నటుడు అల్లరి నరేష్. ‘అల్లరి’ మూవీ తో నటుడిగా కెరిన్‌ను మొదలు పెట్టి, మొదటి సినిమాతోనే తన యాక్టింగ్‌తో అల్లరి నరేష్‌గా మారిపోయాడు. అలా ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ, వాటి ద్వారానే ఎక్కువ శాతం విజయాలను అందుకొని, తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన రూట్ మార్చారు. పూర్తి సీరియస్ మూడ్ లోకి మారిపోయాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రమ్, ఆ ఒక్కటి అడక్కు, వంటి వరుస సినిమాలు చేశాడు. కానీ ఏ ఒకటి కూడా అంతగా హిట్ అవ్వలేదు. చివరగా ‘బచ్చల మల్లి’ మూవీతో వచ్చాడు కథ పరంగా ఆకట్టుకున్నప్పటికి.. ఇది కూడా పరాజయం అయింది. అయితే తాజాగా..
Also Read: Sandeep Reddy : ఆమె నిజస్వరూపం ఇదే.. బాలీవుడ్ హీరోయిన్‌పై సందీప్ రెడ్డి ఫైర్
నరేష్ తన నెక్స్ట్ మూవీని టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన బ్యానర్లలో ఒకటి అయిన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ‘ఆల్కహాల్’ అనే టైటిల్ కూడా మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మించిన సినిమాలు వరుసగా మంచి విజయాలు సాధిస్తూ వస్తున్నాయి. దీంతో అల్లరి నరేష్ తో చేయబోయే సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
