Sandeep Reddy : ఆమె నిజస్వరూపం ఇదే.. బాలీవుడ్ హీరోయిన్‌పై సందీప్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్ టూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక త్వరలో ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుందని ఇటీవల అనౌన్స్ చేశాడు. అయితే ముందు దీపికా అంటూ వార్తలు రాగా, అనేక కండిషన్లు పెట్టడం వల్ల ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశాడని వార్తలొచ్చాయి. అయితే ఇదే ఇష్యూ మీద బాలీవుడ్ మీడియాలో వరుసగా సందీప్‌ను టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి వార్తలు పుట్టిస్తున్నారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ కి కన్నం వేసిన ఆఫీస్ బాయ్..
Also Read
అని గ్రహించిన సందీప్ రెడ్డి వంగా దీపికాకి గట్టి కౌంటర్ ఇచ్చాడు.. సోమవారం అర్ధరాత్రి వేళ ‘ఎక్స్’ వేదికగా దీపిక పేరు ఎత్తకుండానే కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడాడు. ‘నేను ఒక కథని ఆర్టిస్ట్‌కి చెప్పానంటే అవతలి వ్యక్తిపై ఉన్న పూర్తి నమ్మకంతోనే చెబుతాను. కానీ ఆ కథను బయట పెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారు. నా కథని బహిర్గతం చేయడమే కాకుండా ఒక యంగ్ యాక్టర్‌ని కూడా తక్కువ చేయడం మీ ఫెమినిజం? ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వస్తుంది. నాకు అన్ని ఫిల్మ్ మేకింగ్. అది ఆ వ్యక్తి అర్థం చేసుకోదు. ఎప్పటికీ అర్థం కూడా కాదు’ అని సందీప్ అన్నారు. అలానే తన దైన స్టయిల్‌లో హిందీలో డైలాగ్‌ని పంచుకున్నారు. అంతేకాదు ‘డర్టీపీఆర్ గేమ్స్’ అంటూ యాష్ ట్యాగ్‌ని కూడా మెన్షన్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఎవ్వరిని ఉద్దేశించి పెట్టాడో ఈ పాటికి అందరికీ అర్థమైపోవడంతో ఆమె మీద, బాలీవుడ్ పీఆర్ మాఫియా మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You've 'DISCLOSED' the person that you are….
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?