Site icon NTV Telugu

Divyansha Kaushik: ‘మజిలీ’ భామ ఆశలన్నీ రామారావు పైనే!

Divyanshi

Divyanshi

 

శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘మజిలీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. అందులోని అన్షు పాత్రతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అలానే దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంది. తరువాత ఆమె సిద్దార్థ్ నటించిన ‘టక్కర్’ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తోంది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీ విజయంపై భారీ ఆశలు పెట్టుకున్న దివ్యాంశ దీని తర్వాత తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు ఇస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పలు అవకాశాలు వచ్చాయని, అయితే ఆచితూచి అంగీకరించాలని దివ్యాంశ భావిస్తోందట.

Exit mobile version